సత్తా ఉన్న వ్యాసాలు..

జి. లక్ష్మి నరసయ్య

సత్తా ఉన్న వ్యాసాల్ని ప్రస్తుతం సృజనాత్మక రచనలను మించి చదివే పాఠకులున్నారు.అలాంటివారిలో నేనూ ఒకడ్ని. ఇటీవల నేను చదివి బెనిఫిట్ పొందిన సంబందిత పుస్తకాల్లో చల్లపల్లి స్వరూప రాణి రాసిన ‘లోచన’ ఒకటి. ఇందులోని వ్యాసాలకి ‘బహుజన వ్యాసాలు’ అని సరిగానే పెరుపెట్టింది రచయిత. బహుజన వ్యవహారాల్ని బహుజన దృక్పధం నుంచి విశ్లేషించినవి కనుక ఇవి బహుజన వ్యాసాలయినాయి. ఏ ఇష్యూ తీసుకున్నా దాన్ని అంబేడ్కరిస్టు దృక్పధం నుంచి ఇమ్మర్సగా వివరించ గలిగేవాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో నాలుగాకులు ఎక్కువ చదివిన మేధావి స్వరూప రాణి. కవిగా, చరిత్రకారిణిగా, వక్తగా బహుముఖ కృషితో తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధురాలయిన ఈ చెల్లి కలం నుంచి వచ్చిన ఈ వ్యాసాలు మెచూర్డ్ థింకింగ్ తో, బాలన్స్డ్ యాటిట్యూడ్ తో నిండివున్నాయ్.

బహుజన ఉద్యమ కార్యకర్తలకు అవసరమైన సమాచారాన్నీ, సరైన చూపునీ ఇచ్చే వ్యాసాలివి. ఆ మాటకొస్తే మేధావులూ, ఆలోచనాపరులనబడే వారికి కూడా ఇవి మార్గదర్శకాలే. ఇందులో సామాజిక వ్యాసాలూ, సాహిత్య వ్యాసాలూ, సాంస్కృతిక వ్యాసాలూ, చారిత్రక వ్యాసాలూ, ఇంకా విశిష్ట బహుజన ఉద్యమకారులపై రాసిన వ్యాసాలూ ఉన్నాయి. ఫక్తు ఉద్యమ దృష్టినీ, ఫక్తు అకడమిక్ దృష్టినీ దాటుకుని ఆ రెండు దృష్టుల్లో ఉన్న సుగుణాల్ని పుణికి పుచ్చుకుని రాసిన వ్యాసాలివి. స్పష్టతా, సరళతా, సునిశితత్వం, నిరాడంబరతా ఈ వ్యాసాలకు చదివించే గుణాన్నిచ్చాయి. తనలోని కవిని బైటికి రానివ్వకుండా ఒక థింకర్ నీ అనలిస్ట్ ని మాత్రమే ట్యూన్ చేసి వదిలింది ఈ రచయిత. ఫలితంగా క్వాలిటీ ప్రోజ్ ని మనం పొందగలిగాం. ఏది చెప్పినా తగిన ఆర్గ్యుమెంట్ లేకుండా చెప్పదీమె. ఆ ఆర్గ్యుమెంటుకు తగిన ఉదాహరణాలివ్వకుండా ఉండదు. ఎక్కడో పైనుండి మాట్లాడుతున్నట్లు కాకుండా మనలో ఒకరిగా ఉండి చాల common sensical గా, రేషనల్ గా మాట్లాడే ధోరణి చదివేవాళ్లకు ఈమెనూ ఈమె ఆలోచనలనీ అభిమానించేట్లూ అక్కున చేర్చుకునేట్లూ చేస్తుందనడంలో సందేహం లేదు. స్వరూప రాణి ఇంతకు ముందు ‘అస్తిత్వ గానం’ అనే పుస్తకాన్ని రాసింది. అది అందరి మన్ననలు పొందింది. ‘లోచన‘ దానికంటే మెరుగ్గా ఉంది. Remarkable లోతునీ, విస్తరణనీ కలిగివుంది. చదవాల్సిన పుస్తకమిది. చదవకుండా ఉంటే మిస్సయ్యే విషయాలున్న పుస్తకమిది. ఇంత మంచి పుస్తకాన్ని ప్రచురించిన SBT కీ, దాన్ని చక్కగా నిర్వహిస్తున్న దుప్పల రవికుమార్కు అభినందనలు. ఇలాంటి ప్రచురణ సంస్థలని మనం బతికించుకోవాలి. పుస్తకాన్ని కొని మన ప్రేమ చూపాలి.

Please Post Your Comments & Reviews

Your email address will not be published. Required fields are marked *